క‌రోనా నివార‌ణ‌కు రామ్ చ‌ర‌ణ్ రూ.70 ల‌క్ష‌లు సాయం

కరోనా వైరస్‌పై పోరాటం చేస్తున్న కేంద్ర, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు తన వంతు సాయంగా రూ. 70 లక్షల విరాళం అందించనున్నట్టు మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ తెలిపాడు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ సంక్షోభ సమయంలో బాబాయ్ పవన్‌ కల్యాణ్‌ స్ఫూర్తితో తన వంతు సాయంగా ఈ మొత్తాన్ని అందజేయనున్నట్టు ప్రకటించాడు. ఇప్పటికే ఫేస్‌బుక్‌, ఇన్ స్టాగ్రామ్ లలో ఖాతాలు కలిగి ఉన్న చెర్రీ.. ఇప్పుడు ట్విటర్ లోకి కూడా ప్రవేశించాడు.

గురువారం ట్విటర్ లోకి ఎంట్రీ ఇచ్చిన చెర్రీ.. కరోనాపై పోరాటానికి విరాళాన్ని అందిస్తున్నట్టు ఫ‌స్ట్ ట్వీట్ చేశాడు. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్‌ చేస్తున్న కృషిని ప్రశంసించాడు. ఈ విపత్కర సమయంలో ప్రతి ఒక్కరు సురక్షితంగా ఉండాలని సూచించాడు.
చ‌ర‌ణ్‌.

Latest Updates