బాబాయ్ చాలా నీరసంగా ఉన్నారు: చరణ్

విజయవాడ: ఎన్నికల ప్రచారంలో వడదెబ్బ కారణంగా అనారోగ్యానికి గురైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను పరామర్శించారు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. విజయవాడలో తన ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్న పవన్ ను కలిసారు చరణ్. బాబాయ్ కి డాక్టర్ ట్రీట్ మెంటు ఇస్తున్న ఫోటోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి అభిమానులతో పంచుకున్నారు చరణ్.‘  బాబాయ్ చాలా నీరసంగా ఉన్నాడు. అనారోగ్యం కారణంగా ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు. కానీ ఎన్నికలకు తక్కువ సమయం ఉండడం వల్ల బాబాయ్ ఎన్నికల ప్రచారానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇవాళ(ఆదివారం) జరిగే అనకాపల్లి పెందుర్తి ఎన్నికల ప్రచారానికి వెళ్తారు. డాక్టర్లు బాబాయ్ వెంట ప్రచారానికి వస్తామని చెప్పినా  అందుకు ఒప్పుకోలేదు. బాబాయ్ త్వరగా కోలుకొని ప్రజలకు సేవ చేయడంలో ముందుండాలిని కోరుకుంటున్నా‘ అని చరణ్ అన్నారు.

Latest Updates