జనసేనకు మద్దతు ప్రకటించిన రామ్ చరణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  మద్దతు ప్రకటించారు. నాగబాబు తప్ప ఇంతవరకు జనసేనకు మద్దతుగా మెగా ఫ్యామిలీ నుంచి ఎవరూ  సపోర్ట్ ఇవ్వలేదు. తాజాగా రామ్ చరణ్ తన బాబాయ్ కి  కంగ్రాట్స్ చెబుతూ తన ఫేస్ బుక్ లో  పోస్ట్ పెట్టారు. ‘జనసేన మేనిఫేస్టో అద్బుతం. సమాజంలోని అన్ని వర్గాల వారీగా సమ న్యాయం జరుగుతుంది. రాజకీయాల్లో ఇదొక నూతన ఓరవడి.కళ్యాణ్ బాబాయ్ కి కంగ్రాట్స్. అలాగే జనసేన అభ్యర్థులందరికీ ఆల్ ది బెస్ట్‘ గాజు గ్లాసు గుర్తుకు ఓటేయ్యండి‘ అంటూ చరణ్ పోస్ట్ చేశారు. నర్సాపురం ఎంపీగా పోటీచేస్తున్న నాగబాబుకు మద్దతుగా ఆయన కూతురు నిహారిక ఇటీవల ఎన్నికల ప్రచారం చేశారు.

Latest Updates