వర్మ కాక రేపాడు.. ‘మర్డర్‘ ట్రైలర్ రిలీజ్

సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన సినిమాల జోరు పెంచాడు. లాక్ డౌన్ చాలా మంది డైరెక్టర్లు  ఖాళీగా ఉన్నా వర్మ మాత్రం ఫుల్ బిజీ. వరుస పెట్టి సినిమాలు తీస్తూ సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల పవర్ స్టార్ మూవీతో సంచలనం సృష్టించిన వర్మ.. వరంగల్ లో జరిగిన రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిస్తున్న మర్డర్ సినిమా ట్రైలర్ ను ఇవాళ రిలీజ్ చేశారు. ఈ మూవీ ట్రైలర్ ను వర్మ తన ట్విట్టర్లో రిలీజ్ చేశారు. ఈ మూవీ ట్రైలర్ లో వర్మ తనదైన రీతిలో ప్రశ్నలు సంధించాడు. ప్రేమించడం తప్పా? తప్పు చేస్తే చంపించడం తప్పా ? వేరే గతి లేకపోతే చంపించకూడదా? అంటూ ప్రశ్నిస్తూ కాకరేపుతున్నాడు వర్మ. ఈ మూవీకి ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.

Latest Updates