రామోజీ మనవరాలి పెళ్లిలో సీఎం కేసీఆర్

ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మనవరాలి పెళ్లి హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. దివంగత సుమన్- భార్య విజయేశ్వరిల కూతురు కీర్తి సోహన – వినయ్ ల పెళ్లి వేడుక… రామోజీ ఫిలింసిటీలో నిర్వహించారు. రాజకీయ, పారిశ్రామిక, సినీ ప్రముఖులు ఎందరో ఈ పెళ్లివేడుకకు హాజరై కొత్త దంపతులను ఆశీర్వదించారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు కొత్త దంపతులకు ఆశీర్వచనాలు అందించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ రామోజీ మనవరాలి పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. మంత్రులు మెహమూద్ ఆలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ నేతలు పెళ్లికి హాజరయ్యారు.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ దంపతులు, టీడీపీ నేతలు పెళ్లికి వచ్చారు. చంద్రబాబు, కేసీఆర్ వేర్వేరు సమయాల్లో పెళ్లికి వచ్చారు.

రిటైర్డ్ జడ్జి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ ఎన్వీ రమణ, కపిల్ దేవ్, పవన్ కల్యాణ్ ఈ వెడ్డింగ్ సెర్మనీకి హాజరయ్యారు.

 

Latest Updates