మండుతున్న పండ్ల ధరలు

రంజాన్ మాసం కావడంతో మార్కెట్లో అన్నిరకాల పండ్లకి డిమాండ్ పెరిగింది. ముస్లింలు 45 రోజుల పాటు చేసే ఉపవాసాలు దీక్షలో ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకుంటారు. దీంతో మార్కెట్లో దొరికే ఖర్జూరా, వాటర్ మిలన్, మ్యాంగో, గ్రేప్స్, పైనాపిల్, మస్క్ మిలన్లకు గిరాకీ పెరిగింది. రంజాన్ మాసం కావడంతో ఈ నెలలో పండ్ల బిజినెస్ ఎక్కువగా జరుగుతుందంటున్నారు వ్యాపారులు.

ఈసారి రంజాన్ మాసం సమ్మర్లో రావడంతో సాయంత్రం ఒక గంట మాత్రమే గిరాకీ ఉంటుందంటున్నారు వ్యాపారులు. తీసుకొచ్చిన ఫ్రూట్స్ కూడా ఎండకు పాడవుతున్నాయని చెబుతున్నారు. జనం ఎక్కువగా సీజనల్ ఫ్రూట్స్, ఖర్జూరాలు తీసుకుంటున్నారని చెబుతున్నారు. లోకల్ ఖర్జూరా అయితే వంద రూపాయలలోపే ఉందని.. బయటి దేశం నుంచి వచ్చినవైతే 150 రూపాయల దాకా ఉందంటున్నారు వ్యాపారులు.

ప్రస్తుతం మార్కెట్లో దొరికే సీజనల్ ఫ్రూట్స్ మ్యాంగో, వాటర్ మిలన్, మస్క్ మిలన్, పైనాపిల్ లాంటివే కాకుండా ఆన్ సీజనల్ ఫ్రూట్స్ కూడా దొరుకుతున్నాయి. ఇక ధర చూస్తే మ్యాంగో 60 నుంచి 120 రూపాయలు పలుకుతోంది. వాటర్ మిలన్ కేజీ 20 రూపాయిలుగా ఉంది.  గ్రేప్స్ కిలో 80 రూపాయలు,యాపిల్స్ 20 నుంచి 30 రూపాయలు ఉన్నాయి.

సమ్మర్ లో ఎంత ఫుడ్ తీసుకున్నా డిహైడ్రేట్  అవుతారు. అలాంటిది రంజాన్ పండగ సమ్మర్లో వచ్చేసరికి ఎక్కువ ఫ్రూట్స్ తీసుకుంటున్నామని చెబుతున్నారు జనం. మామూలు టైంలో ఉండే రేట్స్ కాస్త ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఫుడ్ తో పోలిస్తే ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటున్నామని చెబుతున్నారు. హోల్ సేల్ తో పాటు రిటైల్ మార్కెట్లోనూ  పండ్ల ధరలు పెరిగాయి. మామూలుగా సమ్మర్ లో పండ్ల రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు రంజాన్ మాసం రావడంతో మరింత పెరిగాయంటున్నారు వ్యాపారులు.

Latest Updates