రాక్షస పాత్రలో రానా

భారీ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన గుణశేఖర్ దర్శకత్వంలో మరొక భారీ చిత్రం రూపు దిద్దుకోనుంది. రానా హీరోగా ‘హిరణ్య కశ్యప’ అనే పౌరాణిక చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు గుణశేఖర్. చాలా రోజులుగా ఈ ప్రాజెక్టు గురించి వార్తలు వినిపిస్తున్నా.. ఇప్పుడు గుణశేఖర్ స్వయంగా ప్రకటించడంతో రూఢి అయ్యింది. దాదాపు మూడేళ్ల పాటు ఈ స్క్రిప్టుపై వర్క్ జరిగినట్టు చెప్పాడు గుణశేఖర్. రానా టైటిల్ రోల్ పోషిస్తున్నాడన్నది తప్ప మరే ఇతర వివరాలనూ వెల్లడించలేదు.  రాక్షస రాజైన హిరణ్య కశిపుడి గాథ అందరికీ తెలిసిందే. అతడి కొడుకు ప్రహ్లాదుడి దైవ భక్తి గురించి అందరూ విన్నదే. మరి ఈ కథని గుణశేఖర్ తన శైలిలో ఎలా తెరకెక్కిస్తాడో, రాక్షసుడి పాత్రలో రానా ఎలా అదరగొడతాడో చూడాల్సిందే.

Latest Updates