తొలిసారిగా పాట పాడిన హీరో రానా

అటు తమిళ్, ఇటు తెలుగు భాషలలో సినిమాలు చేస్తూ మాస్ ప్రేక్షకులకు దగ్గరైన హీరో విశాల్. సుందర్ సి. దర్శకత్వంలో విశాల్, తమన్నా హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా యాక్షన్. ఫుల్‌లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా నవంబర్ 15న విడుదల కాబోతోంది. విశాల్‌కిది 27వ సినిమా. ఈ సినిమాను 60 కోట్ల బడ్జెట్‌తో కేవలం 88 రోజుల్లోనే తెరకెక్కించడం విశేషం.

ఐశ్వర్య లక్ష్మి, యోగి బాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు హిప్‌హాప్ తమిజా సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం ‘బల్లాలదేవ’ రానా తన గొంతు సవరించాడు. చిత్ర యూనిట్ కోరిక మేరకు రానా ఈ సినిమాలో ఒక పాట పాడారు. ‘లైట్స్ కెమెరా యాక్షన్’ అంటూ సాగే పాటను తెలుగులో రానా పాడారు. ఆ పాటను హీరో విశాల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేశారు. కాగా, రానా తొలిసారిగా పాట పాడటంతో ప్రేక్షకుల్లో ఈ పాట పట్ల ఎంతో క్యూరియాసిటి నెలకొంది.

Latest Updates