ఆవేశంతో రగిలిపోతున్న రానా

విలక్షణ పాత్రలకు అచ్చు గుద్దినట్టు సరిపోయే పర్సనాలిటీ రానాది. ‘బాహుబలి’లో భల్లాలదేవగా అతడి రూపాన్ని ఎవ్వరూ మర్చిపోలేరు. ఇప్పుడు మరో సినిమాలో కూడా ఒక ఊహించని లుక్‌‌తో కనిపించనున్నాడు. ప్రభు సాల్మన్ దర్శకత్వంలో ‘హాథీ మేరే సాథీ’చిత్రంలో నటిస్తున్నా డు రానా. ఒక వ్యక్తికి, ఏనుగుకి మధ్య ఉండే అనుబంధాన్ని చూపే ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. తెలుగులో ‘అరణ్య’గా,తమిళంలో ‘కాడన్‌‌’గా విడుదల కానున్న ఈ సినిమాలో రానా ఎలా ఉంటాడో తెలియజేస్తూ ఓ పోస్టర్‌‌‌‌ను కూడా వదిలారు. అడవి మనిషి తరహా గెటప్‌ తో అగ్రెసివ్‌ గా ఉన్న రానాలుక్‌‌ వారేవా అనిపిస్తోంది. రానా తన లుక్‌‌తోనే సినిమాపై క్యూరి యాసిటీని రేపాడంటే..ఇక థియేటర్‌‌‌‌కెళ్లాక ఇంకెంత ఆకట్టుకుంటాడో మరి.

Latest Updates