రానా–మిహీకాల ఎంగేజ్ మెంట్ అయిపోయింది

ఫొటోస్ పోస్ట్ చేసిన రానా
హైదరాబాద్: టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ దగ్గుబాటి రానా, హైదరాబాదీ ఎంటర్ ప్రెన్యూర్ మిహీకా బజాజ్ ల ఎంగేజ్ మెంట్ జరిగింది. తన ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన ఫొటోస్ ను ట్విట్టర్ లో రానా పోస్ట్ చేశాడు. దీనికి ఇట్స్ అఫీషియల్ అని క్యాప్షన్ జత చేశాడు.

ఈ ఫొటోల్లో తెలుగు సంప్రదాయం ప్రకారం పంచకట్టులో రానా మెరిసిపోతూ కనిపించగా, ట్రెడిషనల్ శ్యారీ లుక్ లో మిహీకా ఆకట్టుకుంటోంది. తమ లవ్ మ్యాటర్ ను ఈమధ్యనే రానా రివీల్ చేసిన సంగతి తెలిసిందే. ఎంగేజ్ మెంట్ అయిపోవడంతో ఇక పెళ్లి ఏర్పాట్లలో దగ్గుబాటి ఫ్యామిలీ బిజీ అవ్వనుంది.

Latest Updates