హీరోయిన్ అమీషా పటేల్ కు కోర్టు సమన్లు…

ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్ కు కోర్టు సమన్లు జారీ చేసింది. ఓ సినిమా కథ నచ్చడంతో తానే నిర్మాతగా మారి సినిమా తీయడానికి ముందుకొచ్చింది. దీంతో.. అజయ్ సింగ్ అనే ఫైనాన్సియర్ దగ్గర మూడు కోట్ల రూపాయలను అప్పుగా తీసుకుంది. ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. దీంతో అజయ్ తాను ఇచ్చిన రూపాయలను తిరిగి ఇవ్వమని ఒత్తిడి చేశాడు. ఇక చేసేదేంలేక చెల్లని చెక్కును అజయ్ కు ఇఛ్చింది. దీంతో అమీషాపై అతను రాంచీ కోర్టులో కేసు వేశాడు.

ఈ నెల 8వ తేదీన అమీషా కోర్టుకు హాజరుకావలసి ఉంది. లేక పోతే అరెస్ట్ వారెంట్ జారీచేయనుంది కోర్టు. ఈ విషయం పై అజయ్ స్పందించాడు. తనకు రావలసిన మొత్తాన్ని అమీషా పటేల్ తప్పక వడ్డీతో సహా చెల్లించాలని కోరాడు. ఇప్పుడు చెల్లించడానికి రూపాయలు లేకపోతే అమీషా ఎప్పుడు చెల్లిస్తుందో బాండ్ రాసివ్వాలని చెప్పాడు. ఈవిషయం పై అమీషాతో మాట్లాడాలని చాలాసార్లు చూశానని అయితే ఆమె తప్పించుకుని తిరుగుతుందని అన్నాడు. అమీషా మాత్రం తాను ఎక్కడికీ వెళ్లలేదని ముంబైలోనే ఉన్నాని చెప్పింది.

Latest Updates