ఇవాళ రంగనాయక సాగర్‌ ప్రారంభోత్సవం

ఇవాళ(శుక్రవారం) కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను తరలించి నిల్వచేసే రంగనాయక సాగర్‌ ప్రారంభోత్సవం జరగనుంది. మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ పంపులు ఆన్‌ చేసి గోదావరి జలాలను వదలనున్నారు. దీనికి సంబంధించి  నీటిపారుదల శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఈ ప్రాజెక్టు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.3300 కోట్లను ఖర్చు చేసింది. కాళేశ్వరం నుంచి సుమారు 220 కిలో మీటర్లు ప్రయాణం చేసి సాగునీరు రంగనాయక సాగర్‌కు చేరుకుంటున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం రంగనాయక సాగర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరగనుంది. మొత్తం మూడు TMCల సామర్ధంతో నిర్మాణమైన ఈ ప్రాజెక్టులో ఎప్పుడు 1.5 TMCల నీరు నిలువ ఉంటాయి. ఈ రిజర్వాయర్‌తో మొత్తం 1.10 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించనున్నారు.  రంగనాయకసాగర్ రిజర్వాయర్‌ను చిన్నకోడూరు మం డలంలోని చంద్లాపూర్- పెద్దకోడూరు శివారులో 3 TMCల సామర్థ్యంతో 8.6 కిలో మీటర్ల చూట్టూ భారీ కట్టను నిర్మించారు.

Latest Updates