డిఫరెంట్‌గా సినిమా ప్రమోషన్ చేస్తున్న రాణీముఖర్జీ

కాస్త డిఫరెంట్‌గా..
సినిమాని సినిమాలానే చూడమంటుంటారు కొందరు. అతిగా ఇన్‌‌ఫ్లు‌యెన్స్ కాకూడదని అలా అంటారు. కానీ ఒక్కోసారి సినిమా వల్ల ప్రభావితులు కావడం కూడా మంచిదేనంటోంది రాణీముఖర్జీ. ప్రస్తుతం ‘మర్దా నీ 2’లో నటిస్తోంది. డిసెంబర్ 13న విడుదల కానున్న ఈ సినిమాలో.. చిన్న వయసులోనే సైకోలా మారి, ఆడపిల్లలను రేప్ చేసి, క్రూరంగా చంపుతున్న కిల్లర్‌‌‌‌ని పట్టు కోవడానికి ప్రయత్నించే ఎస్పీ పాత్రను పోషిస్తోంది. అయితే ఆ పాత్ర, ఆ కథ రాణిని చాలా కదిలించాయి. అందుకే సినిమా ప్రమోషన్‌‌ను డిఫరెంట్‌‌గా చేస్తోంది. చాలా కాలేజీలు తిరుగుతోంది. బాల్యంలోనే నేరాలకు పాల్పడటం, బలవడం వంటి అంశాలపై యువతీ యువకులకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తోంది. ‘మన దేశంలో జువైనల్ క్రైమ్ రేట్ బాగా పెరుగుతోంది. ఈ విషయంలో అందరూ మేల్కోవడం చాలా అవసరం. పిల్లలు చెడుతోవ పట్టకుండా, మన ఆడపిల్లలు చెడ్డవాళ్ల బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే’ అంటోన్న రాణి.. ఈ విషయాలపై అవేర్‌‌‌‌నెస్ తెచ్చేందుకు క్యాంపెయినింగ్‌ నిర్వహిస్తోంది. ఉమన్ డెవెలప్‌‌మెంట్ సెల్‌‌ని కలిసి కాలేజీల్లో తీసుకోవాల్సిన రక్షణ చర్యల గురించి కూడా డిస్కస్ చేస్తోంది. కేవలం నటించామా, డబ్బులు తీసుకున్నామా అని కాకుండా.. ఇలాంటి బాధ్యతను తీసుకోవడం నిజంగా మెచ్చుకోదగ్గ విషయం.

Latest Updates