జవాన్లకు అందించే న్యూట్రిషన్ ఫుడ్‌‌‌‌లో తేడాలు ఎందుకు?

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: సాయుధ దళాల్లో జవాన్లకు అందిస్తున్న న్యూట్రిషన్ ఫుడ్ విషయంలో నియమాలను మళ్లీ పరిశీలించాలని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ కోరారు. డిఫెన్స్‌‌‌పై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నిర్వహించిన మీటింగ్‌‌లో రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జవాన్లకు అందించాల్సిన భోజనం తదితర విషయాలపై రాహుల్ తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. జవాన్లకు తక్కువ న్యూట్రిషన్ ఫుడ్ అందించడం సబబు కాదన్నారు. సరిహద్దుల్లో నిలబడి పహారా కాస్తూ దేశాన్ని రక్షిస్తున్న సైనికులకు అందించాల్సిన న్యూట్రిషన్‌‌‌ ఫుడ్‌‌‌పై పున: ఆలోచించాలన్నారు. ఆఫీసర్స్‌‌‌కు ఎంత మొత్తంలో న్యూట్రిషన్ ఫుడ్‌‌‌ను అందిస్తున్నారో అంతే మొత్తంలో జవాన్లకూ అందించాలన్నారు.

ర్యాంకుల ఆధారంగా న్యూట్రిషన్ ఫుడ్‌‌‌‌ అందించడంలో తేడాలు ఉండకూడదని రాహుల్ సూచించారు. ర్యాంకులను బట్టి వేతనాలు ఇవ్వొచ్చు గానీ న్యూట్రిషన్ వ్యాల్యూస్ అందించడంలో ఎలాంటి తేడాలు ఉండకూడదని పేర్కొన్నారు. ఈ విషయంపై డిఫెన్స్ మినిస్ట్రీ అధికారులు క్లారిటీ ఇచ్చారు. అధికారులు, జవాన్ల మధ్య ఫుడ్ విషయంలో క్వాలిటీ, క్వాంటిటీల్లో ఎలాంటి తేడాలు ఉండవని తెలిపింది. అయితే అఫీసర్స్‌‌‌కు వడ్డించే ఐటమ్స్ విషయంలో జవాన్లతో పోల్చుకుంటే కొంత వైవిధ్యం ఉంటుందన్నారు. డిఫెన్స్ పై నిర్వహించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశానికి బీజేపీ లీడర్, మాజీ కేంద్ర మంత్రి జువల్ ఓరమ్ అధ్యక్షత వహించారు.

Latest Updates