బెంగాల్ లో మరో లతా మంగేష్కర్..

రీసెంట్‌‌గా బేబీ అనే ఒకావిడ పాటలు పాడుతూ తన సింగింగ్ టాలెంట్‌‌తో బాగా ఫేమస్ అయింది.  చిరంజీవి, మ్యూజిక్ డైరెక్టర్ కోటి కూడా ఆమెను పిలిచిమరీ  అభినందించారు. అయితే ఇప్పుడు బెంగాల్‌‌లో మరోకావిడ.. అచ్చం లతామంగేష్కర్‌‌‌‌లానే పాటలు పాడుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. 

పశ్చిమ బెంగాల్‌‌లోని రాణా ఘాట్ రైల్వేస్టేషన్లో పనిచేసే రాణు అనే మహిళ అప్పుడే పని ముగించుకుని సరాదాగా “యే ప్యార్ కా నగ్మా హై” అంటూ ఒక పాట అందుకుంది. ఆమె గొంతు అచ్చం  లతా మంగేష్కర్‌‌‌‌లాగానే ఉండటంతో  అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు.   వెంటనే ఆమె పాడిన పాటను వీడియో తీశారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సోషల్ మీడియాలో అప్‌‌లోడ్ చేశారు. అంతే.. రెండు రోజుల్లోనే ఆమె గొంతు  సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. చాలామంది యూట్యూబ్ ఛానెళ్ల వాళ్లు, మీడియా వాళ్లు ఆమె అడ్రెస్ తెలుసుకుని మరీ ఆమెను ఇంటర్వ్యూలు చేశారు.  ఆమె ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ.. ” సరాదాగా పాడిన పాట అంతలా వైరల్ అవుతుందని అస్సలు ఊహించలేదని, నాకు ఇంతలా పబ్లిసిటీ వచ్చిందంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని” అంటోంది.  కొంతమంది సినిమా వాళ్లు రాణుకు  సినిమాలో పాడే ఛాన్సులు కూడా ఇస్తామన్నారు. దీంతో ఆమె ఇంకా సంబరపడిపోయింది.

 

Latest Updates