నోట్లో గుడ్డలు కుక్కి.. పన్నెండేండ్ల బాలికపై అత్యాచారయత్నం

హైదరాబాద్ :12 సంవత్సరాల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారయత్నం చేశాడు. ఈ సంఘటన రాజేంద్రనగర్ లో మంగళవారం జరిగింది. ఒంటరిగా ఉన్న బాలికపై అదే ప్రాంతానికి చెందిన బాలరాజ్ అనే వ్యక్తి దాడి చేసి అత్యాచారం చేయబోయాడు. బాలిక ఇంట్లోకి ప్రవేశించి అరవకుండా ఆమె నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారానికి ప్రయత్నించాడు.

ఇంటి యజమానికి అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్లి చూడగా నోట్లో గుడ్డలతో బాలిక ఏడుస్తూ కనిపించింది. అప్పటికే బాలరాజ్ పరారీ అయ్యాడని యజమానికి బాలిక తెలుపగా.. అతడు పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates