తోటి వాచ్‌మ‌న్‌ భార్యపై లైంగికదాడికి యత్నం

Rape Attempt on Apartment watchman's Wife
  • మద్యం మత్తులో ఘటన
  • ఆలస్యంగా వెలుగులోకి..

కూకట్ పల్లి, వెలుగు: తనతోపాటు వాచ్ మన్ గా పనిచేసే వ్యక్తి భార్యపై లైంగికదాడికి యత్నిం చాడో ప్రబుద్ధుడు. ఈ ఘటన కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిం ది. పోలీసులు, బాధితురాలి కథనం ప్రకారం.. 3 నెలల క్రితం చెన్నూరి మూర్తి తన భార్యతో కలిసి కూకట్ పల్లి భాగ్ అమీర్ లో ని సాయి తేజ అపార్ట్​మెం ట్ లో నైట్ షిఫ్ట్ వాచ్ మె న్ గాపనిచేస్తూ అపార్ట్​మెంట్  పెంటౌస్ లో నివసించేవాడు. మూర్తి భార్య అపార్ట్​మెంట్ ఫ్లాట్స్​లో పనిచేస్తుంది. ఇదే అపార్ట్​మెంట్లో ఉదయం వాచ్ మెన్ గా పనిచేసే శ్రీశైలం అపార్ట్​మెం ట్ సెల్లార్ లో ఉండేవాడు.ఈ నెల 20న అర్ధరాత్రి మూర్తి నైట్ షిఫ్ట్ విధులు నిర్వహిం చాడు. అదే సమయంలో శ్రీశైలం తాగిన మత్తులో మూర్తి  భార్యపై అత్యా చారయత్నం చేశాడు. ఆమె గట్టిగాఅరవడంతో అక్కడి నుంచి పారిపోయాడు. భర్త స హాయంతో మంగళవారం బాధితురాలు కూకట్ పల్లి పోలీసులకు ఫిర్యా దు చేసింది. దీంతో ఎస్సై నారాయణసింగ్ కేసు నమోదుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Latest Updates