ఫొటో స్టూడియోలో బాలికపై అత్యాచార యత్నం

హైదరాబాద్ : ఫోటో తీయించుకునేందుకు స్టూడియోకి వెళ్లిన మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు షాపు యజమాని సలీం. ఈ సంఘటన నేరేడ్ మెట్, సైనిక్ పురి లో సోమవారం జరిగింది. నిన్న ఉదయం పాస్ ఫొటో కోసం ఓ మైనర్ బాలిక స్థానిక  RS డిజిటల్ ఫోటో స్టూడియోకి వెళ్లింది. ఫొటో తీసే క్రమంలో డోర్ క్లోజ్ చేసి ఆమెపై చేతులు వేసిన సలీం.. తర్వాత అత్యాచారం చేసే ప్రయతం చేసాడు. బాలిక అరుచుకుంటూ బయటకి పరుగులు తీసి స్థానికులకు సలీం ప్రవర్తన గురించి తెలిపింది.

దీంతో స్థానికులు సలీంకి దేహశుద్ది చేశారు. ఈ సంఘటనపై బాలిక తల్లి మంగళవారం నెరేడ్ మెట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గాయాలపాలైన సలీం ప్రస్తుతం స్థానిక హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడని.. అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు పోలీసులు.

ఇల్లీగల్ ఓల్డేజ్ హోమ్స్

Latest Updates