అత్యాచారం కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్

హైదరాబాద్ : ఐదు రోజుల క్రితం మహిళకు మద్యం తాగించి అత్యాచారం చేసిన కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.వనస్థలిపురంలోని తన కార్యాలయంలో ఏసీపీ గాంధీనారాయణ శుక్రవారం వివరాలు వెల్లడించారు.నగరానికి చెందిన మహిళ(32) భర్తతో విడాకులు తీసుకొని  కుమారుడితో తన తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. కొద్ది రోజుల క్రితం కోలన్ సిద్ధార్థరెడ్డి అనే యువకుడి ద్వారా మనోజ్ కుమార్ యాదవ్ అనే వ్యక్తితో పరిచయమైంది.అనంతం మనోజ్ కుమార్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకు న్నాడు. తనను నమ్మించేందుకు ఓ దేవాలయంలో పసుపుతాడు కూడా కట్టాడు. కొద్ది రోజుల తర్వాత మనోజ్ ఆ మహిళను దూరం పెట్టాడు. ఈ నెల 13న వనస్థలిపురం స్నేహమయినగర్ కాలనీలో మనోజ్ తన స్నేహితులైన కోలన్ సిద్ధార్థరెడ్డి, జరుమల్లి సతీష్,ఉదయ్ కిరణ్, జంగారెడ్డి అనే నలుగురు స్నేహితులతో కలిసి మద్యం తాగుతూ..మహిళను అక్కడి కి పిలిపించాడు.

అక్కడికి చేరుకున్న ఆమెతో గొడవకు దిగిన మనోజ్ మహిళకు బలవంతంగా మద్యం తాగించాడు. వారి నుంచి తప్పించుకునేందుకు ఆమె బాత్రూమ్ లోకి వెళ్ళి తనతో తెచ్చుకున్న స్లీపింగ్ టాబ్లెట్లను మింగేసింది. మహిళ మత్తులో ఉండగానే మనోజ్ తో పాటు అతడి స్నేహితులు ఆమెపై అత్యాచారానికి పాల్పడారు. తర్వాత మహిళ ఫోన్ తీసుకొని ఆధారాలు లేకుండా మనోజ్,ఆ మహిళ కలిసి దిగిన ఫొటోస్ డిలీట్ చేశారు. తర్వాత ఆమెను సైదాబాద్ లోని సాయి నర్సింగ్ హోమ్ కి తరలించి స్టమక్ వాష్ చేయించారు.ఈ కేసులో ప్రధాన నిందితుడు మనోజ్ తో పాటు కొలన్ సిద్ధార్థ రెడ్డి,గరుగుమల్లి సతీష్ ను అరెస్ట్ చేసి రెండు కార్లు,నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.మరో ఇద్దరు నిందితులు ఉదయ్ కిరణ్,జంగా రెడ్డి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Latest Updates