రేప్ కేసులపై హైకోర్టు సీజేలు, సీఎంలకు లేఖ: కేంద్రం

న్యూఢిల్లీ: మైనర్లపై జరిగిన రేప్ కేసుల్లో రెండు నెలల్లోనే దర్యాప్తు పూర్తి కావాలని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. న్యాయ శాఖలో అన్ని స్థాయిల్లో తీసుకోవాల్సిన చర్యలపై డైరక్షన్ ఇస్తామని చెప్పారు. అలాగే మైనర్ల రేప్ కేసుల్లో రెండు నెలల్లోనే దర్యాప్తు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు లేఖలు రాస్తానన్నారు కేంద్ర మంత్రి.

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు దేశ వ్యాప్తంగా 1023 ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ చెప్పారు. అందులో ఇప్పటికే 704 కోర్టులు వర్క్ అవుతున్నాయని, మిగిలినవి త్వరలోనే ఏర్పాటు చేస్తామని చెప్పారు.

MORE NEWS:

అత్యాచారాల రాజధానిగా భారత్

స్త్రీని భోగవస్తువుగా చూడొద్దు.. మగవాడు కట్టుబాట్లు పాటించాలి

Latest Updates