దారుణం : 4 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం

చిన్నపిల్లలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. దేశమంతటా నిరసనలు జరుగుతున్నా… కేసుల్లో దోషులకు మరణ శిక్షలు పడుతున్నా.. చిన్న పిల్లలపై అత్యాచారాలు ఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉన్నాయి. మహారాష్ట్రలో మరో దారుణం జరిగింది. నాలుగేళ్ల చిన్నారిపై… ఆమె దగ్గరి బంధువే లైంగికదాడి చేశాడు.

మహారాష్ట్రలోని నాగ్ పూర్ సిటీ.. వాడి ఏరియాలో ఈ దారుణం జరిగింది. బాధితురాలి తల్లి.. ఇళ్లలో కూలీ పని చేసుకుని జీవనం సాగిస్తోంది. ఆమెకు చెల్లి వరుసయ్యే ఓ వివాహిత ఇంట్లో రెండేళ్లుగా ఉంటోంది. కూలీ పనికి వెళ్లినప్పుడు కూతురును తనతోపాటే తీసుకెళ్తూ ఉండేది. ఐతే… సెలవులు కావడంతో ఇంట్లోనే ఉంచి వెళ్తోంది. సోమవారం రోజున అదే ఇంట్లో ఉండే 25 ఏళ్ల భూషణ్ దాహత్ మృగంగా మారాడు. చిన్న పాప అని కూడా చూడకుండా.. ఆమెపై అత్యాచారం చేశాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో ఆ చిన్నారి సైలెంట్ గా ఉండిపోయింది. మర్నాడికి ఆ చిన్నారికి జ్వరం రావడంతో.. తల్లి ఆరా తీసింది. తల్లి పనికి వెళ్తుంటే కూతురు అడ్డుపడింది. కూతురు బెదిరిపోవడం చూసి గట్టిగా అడిగే సరికి జరిగిన ఘోరం మొత్తం చెప్పింది ఆ చిన్నారి.

వెంటనే కూతురుతో ఆ తల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. ఇంట్లో ఉన్న అంకుల్ మంచోడు కాదనీ రాక్షసుడనీ.. చెప్పడంతో.. నిందితుడు భూషణ్ దాహత్ ను వాడి ఏరియా పోలీసులు అరెస్ట్ చేశారు. ఐపీసీ సెక్షన్ 376 కింద అత్యాచారం కేసు పెట్టి లోపలేశారు.

Latest Updates