క్షుద్రపూజల పేరుతో వివాహితపై అత్యాచారం

  • భర్త సహకారంతో దారుణం

క్షుద్రపూజల పేరుతో భర్త సహకారంతో వివాహితపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇన్‌‌ స్పెక్టర్ జగదీశ్వర్ రావు వివరాల ప్రకారం.. మౌలాలి మహాత్మా గాంధీనగర్‌‌కి చెందిన యువతి(27)కి ఈస్ట్ ప్రగతి నగర్‌‌కి చెందిన వ్యక్తి (32)తో నాలుగేండ్ల క్రితం పెండ్లయింది. వారికి ముగ్గురు పిల్లలు. డ్రైవర్‌‌గా పని చేస్తున్న అతడికి రూ.5లక్షల వరకు అప్పులుండడంతో నిజామాబాద్‌‌లోని ముర్షాద్ మహ్మద్‌ ‌యూనుస్‌ ఖాన్‌‌(59)ని కలిసి ఇబ్బందుల గురించి చెప్పాడు. అతడి భార్యపై కన్నేసిన యూనుస్ క్షుద్రపూజలు చేస్తే ఇబ్బందులు పోతాయని నమ్మించాడు. ఇంటి కెళ్లిన అతడు కష్టాలు తీరేందుకు ముర్షాద్‌‌తో పూజలు చేయిద్దామని చెప్పి, ఈనెల 23న అర్ధరాత్రి యూనుస్ ఫ్రెండ్ సలీమ్ ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడున్న యూనుస్ బలవంతంగా ఆమె బుర్ఖాతీయించి వివస్త్రను చేశాడు. ఆ తర్వాత నిద్రలోకి జారుకున్న బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెప్తే చనిపోతావని భయపెట్టాడు. దెయ్యం పోలేదని మరోసారి పూజకు తీసుకురావాలని ఆమె భర్తకు చెప్పాడు. బాధితురాలి కంప్లైయింట్ తో మల్కాజిగిరి పోలీసులు సోమవారం యూనుస్, ఆమె భర్తను అరెస్ట్ చేసి రిమాండ్‌‌కి తరలించారు.