ఆమెకు HIV ఉందని తెలిసినా రేప్ చేశాడు

కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ యవకుడు పశువులా ప్రవర్తించాడు. హెచ్ఐవీ ఉందని తెలిసినా ఓ మహిళపై అత్యాచారం చేశాడు.  మే 10 న మహారాష్ట్రలోని ముంబైలో  జరిగిన ఈ ఘటన ఆలస్యంగా తెలియడంతో  పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ‘కిడ్నీ వ్యాధితో భాదపడుతున్న తన సోదరికి హాస్పిటల్ లో తోడుగా ఉంటుంది ఓ మహిళ. అయితే అక్కడే  పని చేస్తున్న ఓ యువకుడు  ఆ మహిళపై  లైంగిక దాడి చేయాలని ప్లాన్ చేశాడు. అందులో భాగంగానే ఆమెతో మాటలు కలిపాడు. హాస్పిటల్ లో సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తున్నానని ఆమెను నమ్మించాడు.  ఆమె వివరాలు కనుక్కుని ఆర్థిక పరిస్థితిని ఆసరగా తీసుకున్నాడు. హాస్పిటల్ పై అంతస్తులో ఓ ఫామ్ నింపితే మందులు తక్కువ రేటుకు ఇస్తారని చెప్పి ఆమెను టెర్రస్ పైకి తీసుకెళ్లి బలవంతంగా అత్యాచారం చేశాడు. ఆ మహిళ ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడం వల్ల అతడి నుంచి తప్పించుకోలేక పోయింది. తనకు హెచ్ ఐవి ఉందని ఆ మహిళ చెప్పినా అతను వినకుండా అత్యాచారం చేశాడు. ఘటన తర్వాత దగ్గర్లోని సియాన్ పోలీస్ స్టేషన్లో కంప్లేయింట్ ఇచ్చారు.  అక్కడున్న సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా అత్యాచారం చేసింది అన్నప్ప అనే యువకుడిగా గుర్తించి అరెస్ట్ చేశామని‘ చెప్పారు.

 

 

 

Latest Updates