పశువులా మారిన పెద్దనాన్న.. నాలుగేళ్ల చిన్నారిపై దారుణం

ఎన్ని కఠినమైన చట్టాలు తీసుకువచ్చినా.. చిన్నారులపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన దుర్మార్గులు పశువుల్లా వ్యవహరిస్తున్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం జరిగింది. మహాముత్తారం మండలం కోనంపేట లో నాలుగేళ్ళ చిన్నారిపై లైంగిక దాడి జరిగింది.

కోనంపేట గ్రామానికి చెందిన నాలుగేళ్ల బాలికపై భూపాలపల్లి మండలం నాగారం గ్రామానికి చెందిన రాస కొమురయ్య అత్యాచారానికి పాల్పడ్డాడు.

చిన్నారికి స్వయానా పెద్దన్నాన్న అయిన నిందితుడు గత రాత్రి ఇంట్లో తల్లితో పాటు నిద్రిస్తున్న నాలుగేళ్ల బాలికను గుట్టుచప్పుడు కాకుండా తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడు. ఈ దారుణంపై  ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు కాటారం డీఎస్పీ బోనాల కిషన్ తెలిపారు. నిర్ధారణ పరీక్షల నిమిత్తం చిన్నారిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించామన్నారు. నిందితున్ని గురించి స్పెషల్ టీమ్ లతో గాలింపు చర్యలు చేపడుతున్నట్లు కిషన్ చెప్పారు.

Latest Updates