కోటి రూపాయలు ఇస్తేనే టికెట్: మంత్రి మల్లారెడ్డి ఇష్టారాజ్యం

కోటి రూపాయలు ఇచ్చిన వారికే మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేయడానికి మంత్రి మల్లారెడ్డి టికెట్లు కెటాయించారని అన్నారు బోడుప్పల్ టీఆర్ఎస్ అసమ్మతి నేత రాపోలు రాములు. నగరంలో భూకబ్జా, చెరువులు కబ్జా చేసిన వారికే  బోడుప్పల్ కార్పొరేషన్ లో అవకాశం కల్పించారని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకుగాను తమదగ్గర ఆదారాలున్నాయని చెప్పారు. గత కాలంలో ఎన్నో ఉద్యమాలు తాము చేశామని మల్లారెడ్డి ఆహ్వానం మేరకే తాను కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరానని చెప్పారు. అయితే ఎల్లప్పుడూ ప్రజల్లో ఉండి…  టీఆర్ఎస్ పార్టీని ప్రజల్లోకి తామే తీసుకెళ్లామని అన్నారు. తమ పోరాటం వల్లే ప్రభుత్వం బోడుప్పల్ లో  డ్రైనేజీలు, నల్ల కనెక్షన్ లు ఏర్పాటు చేసిందని ఆయన అన్నారు.  అయితే ఇప్పుడు ఎవరు కోటిరూపాయలు ఇస్తే వాళ్లకే మంత్రి మల్లారెడ్డి టికెట్లు కెటాయించారని చెప్పారు. తమను ఆయన కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడకుండానే డార్డులను పెట్టి భయటకు పంపించారని తెలిపారు.  భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలా వద్దా అనే విషయం త్వరలో ప్రకటిస్తామని చెప్పారు.

 

Latest Updates