రాష్ డ్రైవింగ్ కారణంగా ఇద్దరు మృతి

హైదరాబాద్ లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. రాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ కారణాలతో రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి.  అల్వాల్ నుంచి సుచిత్ర వైపు వెళ్లే రోడ్డులో ఓ బైక్‌ను జూమ్ కారు ఢీకొట్టడంతో అల్వాల్ లోని BHEL ఎంక్లేవ్  కు చెందిన ప్రియదర్శిని(28), ఆమె మేనల్లుడు అయాన్ మృతి చెందారు.

ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో నర్స్ గా పని చేస్తున్న ప్రియదర్శిని.. ఆస్పత్రికి వెళ్లి ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెనుక నుండి వచ్చిన కారు వీరి బైకు ను ఢీ కొట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. జూమ్ కారు లో అద్దెకు తీసుకున్న ఇద్దరు యువకులు నిర్లక్ష్యంగా కారు నడపడం వల్లే ఈ దారుణం జరిగిందని అల్వాల్ పోలీసులు తెలిపారు. ఆ ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నామన్నారు. ప్రియదర్శిని, అయాన్ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.  ఈ ఘటనలో గాయపడిన ప్రియదర్శిని అన్న వరుణ్ ను చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.