ర్యాష్ డ్రైవింగ్..ఇద్దరు యువకులు మృతి

అతి వేగం ఇద్దరు ప్రాణాలను బలితీసుకుంది. ఈ విషాద సంఘటన ఇవాళ సాయంత్రం హైదరాబాద్ లోని నెక్లెస్‌రోడ్‌లో జరిగింది.  ఖైరతాబాద్ ప్రాంతానికి చెందిన నిఖిల్ (16) , ప్రశాంత్ (18) లు ట్యాంక్ బండ్ లోని జలవిహార్ నుండి  ఖైరతాబాద్ వెళ్తుండగా ..వారు ప్రయాణిస్తున్న హోండా షైన్ బైక్ (AP09CG8105) అదుపు తప్పి డివైడర్ ఢీ కొట్టింది. దీంతో డ్రైవింగ్ చేస్తున్న నిఖిల్ అక్కడికక్కడే చనిపోయాడు.  బైక్ వెనుక కూర్చున్న ప్రశాంత్ తీవ్రంగా గాయపడ్డాడు. ఘటన స్థలానికి చేరుకున్న లేక్ , రాంగోపాల్ పేట పోలీసులు బాధితుడిని స్థానిక కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రశాంత్ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న రాంగోపాల్ పేట పోలీసులు దర్యాప్తు చేపట్టారు .నిఖిల్ మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ మార్చురీకి తరలించారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలను చెందిన కొంతమంది యువకులు తరుచుగా బైక్ రేసింగ్ లు నిర్వహిస్తుండటంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నట్లు స్థానికలు చెబుతున్నారు.

Latest Updates