వాళ్లతో నటించడం బోనస్!

కన్నుమూసి తెరిచేలోగా మోస్ట్ వాం టెడ్ హీరోయిన్ అయిపోయింది రష్మిక మందాన్న. ఆమె మహేష్‌‌బాబు సరసన నటిం చిన ‘సరిలేరు నీకెవ్వరు’ఈ నెల 11న విడుదల కానున్న సందర్భంగా రష్మికతో చిట్‌‌ చాట్..ఈ నెల 11న విడుదల కానున్న సందర్భంగా రష్మికతో చిట్‌‌ చాట్..

  • ఇది నా ఐదో సినిమా. నేనింకా ఎక్సెపెరిమెంటల్​ పీరియడ్‌‌లోనే ఉన్నాను. నా కేపబిలిటీస్‌‌ని పరీక్షించుకుంటున్నాను. ‘డియర్​ కామ్రేడ్’లో సీరియస్​ రోల్​ చేసాను. ఈ సినిమాలో కామెడీ సీన్లు ఎక్కువ చేశాను. ఏది ఈజీయో ఇంకా అర్థం కావడం లేదు. అన్ని జానర్స్​ చేయగలగాలి. అప్పుడే మంచి నటిగా గుర్తింపు వస్తుంది.
  • కథ విన్నప్పుడే పర్‌‌‌‌ఫార్మెన్స్‌‌కి ఎక్కువ స్కోప్ ఉందని అర్థమయింది. కథలో మంచి ఫీల్​ ఉంది, కామెడీ ఉంది. దానికితోడు అందరూ సీనియర్​ యాక్టర్స్. అంతేకాదు… మహేష్​గారు, విజయశాంతిగారితో కలిసి నటిచడం బోనస్ అనుకున్నా.  అందుకే ఒప్పుకున్నా. సినిమా షూటింగ్​ జరుగుతున్నంత సేపూ ఎంజాయ్​ చేస్తూనే ఉన్నాం.
  • మహేష్​గారితో సినిమా అంటే చాలా భయం వేసింది. ఎలా చేస్తానో అని యాంగ్జయిటీ ఫీలయ్యా కూడా. సెట్‌‌లో ఆయన చాలా కామ్‌‌గా ఉండేవారు. నాదేమో హీరోని టార్చర్​ పెట్టే క్యారెక్టర్. అంత పెద్ద హీరోతో అలా చెయ్యాలంటే ఆ మాత్రం భయం ఉంటుంది కదా. కాస్త అలవాటయ్యాక  నేను నటించిన సినిమాలన్నీ చూశానని చెప్పారు. హమ్మయ్య అనుకున్నా.
  • విజయశాంతిగారితో నాకు కాంబినేషన్​ సీన్స్​ లేవు. క్లయిమాక్స్‌‌లో ఒకసారి కలుస్తామంతే. కేరళలో షూటింగ్​ జరిగినప్పుడు ఆమెతో  మాట్లాడే చాన్స్​ వచ్చింది. చాలా ఎనర్జిటిక్​ పర్సన్. మొదట నాకు కొంచెం భయమేసింది కానీ  ఆవిడ మాత్రం చాలా బాగా కలిసిపోయారు.
  •  నా పాత్ర చాలా డ్రమెటిక్‌‌గా ఉంటుంది.  చేసేటప్పుడు కొంచెం కష్టంగా అనిపించేది. డైరెక్టర్​ గారిని ఒకసారి చెయ్యమని అడిగి, అది చూసి నేర్చుకుని చేసేదాన్ని. మీకు అర్థమవుతోందా, ఐ రిక్వెస్ట్​ యు, అబ్బబ్బా అంటూ నేను వాడే ఊతపదాలు సినిమా చూసేవాళ్లకి చాలా కిక్కిస్తాయి. ట్యాగ్‌‌లైన్‌‌కి తగ్గట్టు నెవ్వర్​ బిఫోర్​, ఎవ్వర్​ బిఫోర్​ క్యారెక్టర్​ చేశాను.

చిరంజీవిగారు నా సినిమా ఫంక్షన్‌‌కి రావడం ఇది మూడోసారి. ఆయన వచ్చిన రెండు సినిమాలూ హిట్టయ్యాయి. అందుకే ఆయన్ని నా లక్కీ చార్మ్‌‌గా భావిస్తా.  ఇది కూడా హిట్టవుతుంది చూడండి. ఈ సంవత్సరమంతా పని చేస్తూనే ఉండాలి నేను. ఫిబ్రవరిలో బన్నీతో చేసే సినిమా సెట్స్‌‌కి వెళ్లనుంది. ఈలోపు నితిన్‌‌తో నేను నటించిన ‘భీష్మ’ రిలీజ్​ కానుంది. ఇలా నా సినిమాలు బ్యాక్​ టు బ్యాక్​ రిలీజవుతుంటే చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడూ ఇలాగే బిజీబిజీగా కొనసాగాలని నా ఆశ.

Latest Updates