ఉన్నది పోయింది.. పోయింది వచ్చింది

ఇక ఎన్నటికీ అది కనిపించదనుకున్నారు. అరుదైన రూపాన్ని ఫొటోల్లోనే చూసుకోవాలని బాధపడిపోయారు. కానీ ఒక్కసారిగా దాని దర్శనంతో ఆశ్చర్యపోయారు. టీవీ చానెల్ ‘యానిమల్ ప్లానెట్’ ఇటీవల గాలాపగోస్ అగ్ని పర్వత ద్వీప అన్వేషణకు వెళ్లింది. అక్కడ 1906లో అంతరించిపోయిందనుకుంటున్న ఫెర్నాండియా తాబేలు వాళ్లకు కనిపించింది. దీంతో ఆశ్చర్యపోయిన టీమ్ దానిపై షో చేసింది. దాని వయసు ఎంతుంటుందో ఇప్పుడే చెప్పలేమని యానిమల్ ప్లానెట్ పేర్కొంది. తర్వాత తాబేలును కన్జర్వేషన్ సెంటర్ కు తరలించారు. దాన్ని బ్రీడింగ్ సెంటర్ కు తరలించి, సంతానోత్పత్తిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని భావిస్తున్నారు. ఇక, వాతావరణ మార్పు ఉపద్రవానికి అరుదైన చిట్టెలుక బలైంది. గ్రేట్ బారియర్ రీఫ్ వద్ద తిరిగే ‘బ్రాంబుల్ కే మెలోమీ’ అంతరించిపోయినట్లు ఆస్ట్రేలియా సర్కా రు ప్రకటించింది.

2009 నుంచి ఈ చిట్టెలుకలు రీఫ్స్ వద్ద కనిపించడంలేదని చెప్పింది. అక్కడ కనిపించే ఏకైక ఉభయచర జీవులు ఈ చిట్టెలుకలే. మనిషి చేసిన పనుల వల్లే అవి అంతరించిపోయాయని సైంటిస్టులు అంటున్నారు. పెరిగిన సముద్ర మట్టం , తుఫానులు, ఈ చిట్టెలుకల ఆవాసాలతో పాటు వాటి తిండిని ధ్వం సం చేశాయని వెల్లడించారు. వేగంగా జీవులు అంతరిస్తున్న దేశాల జాబితాలో ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉంది. తొలిస్థా నంలో ఫ్రెంచ్ పాలి నేసియా, రెండో స్థానంలో మారిషస్ ఉన్నాయి.

Latest Updates