స్కూల్ పిల్లలను కొరికిన ఎలుకలు

స్కూల్  పిల్లలను కొరికిన ఎలుకలు
  • 9 మంది స్టూడెంట్లను కొరికిన ఎలుకలు
  • చటాన్​పల్లి​ బీసీ గురుకులంలో కలకలం

షాద్ నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా షాద్​నగర్ పట్టణం చటాన్​పల్లి గురుకుల స్కూలులో నిద్రపోతున్న 9 మంది స్టూడెంట్లను ఎలుకలు కొరికాయి. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో స్టూడెంట్స్ కాళ్లకు గాయాలయ్యాయి. వారిని వెంటనే ప్రభుత్వ దవాఖానకు తరలించి ట్రీట్​మెంట్ అందించారు. చటాన్ పల్లిలో కేశంపేట, దౌల్తాబాద్ కు చెందిన రెండు బీసీ గురుకుల స్కూళ్లను ఒకే దగ్గర నిర్వహిస్తున్నారు. దాదాపు 850 మంది స్టూడెంట్స్,25 మంది టీచర్లు ఇక్కడ ఉన్నారు. ఆదివారం రాత్రి భోజనం చేశాక దాదాపు 40 మంది స్టూడెంట్లు ఒకే గదిలో పడుకున్నారు. కాగా తొమ్మిదో తరగతికి చెందిన 9 మందిని ఎలుకలు కరిచాయి. ఈ విషయం బయటకు తెలియకుండా సిబ్బంది వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాగా, ఈ స్కూలులో కనీస సౌలత్​లు లేవు. రూమ్​కు కిటికీలు కూడా సరిగా లేకపోవడంతో స్టూడెంట్స్​తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. లోపలికి చలి రాకుండా కిటికీలకు దుప్పట్లు అడ్డుగా పెట్టి నిద్రపోతున్నారు. కిటికీలకు డోర్లు లేకపోవడం వల్లే ఎలుకలు గదిలోకి వచ్చి కొరికాయని బాధిత స్టూడెంట్స్ తెలిపారు.