చెరగని చిరునవ్వుతో.. నేలపై కూర్చుని

రతన్ టాటా షేర్ చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సృజనాత్మకత.. పట్టుదల.. జన్మభూమి మీద ప్రేమ.. ఇవన్నీ కలిస్తే వ్యాపార దిగ్గజం రతన్‌ టాటా రూపం వస్తుంది. సవాళ్లను స్వీకరించడం.. విజయం సాధించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. నష్టాల్లో ఉన్న ఎన్నో …లాభాల పట్టించిన ఆయన తనలోని సృజనాత్మకతను వెలికి తీస్తున్నారు. వ్యాపార నిమిత్తం బిజీగా ఉన్న టాటా..రిటైర్మెంట్ తరువాత తనకిష్టమైన వ్యాపకాలతో ఆనందంగా గడిపేస్తున్నారు. 82ఏళ్ల వయసులో ఇన్ స్ట్రాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి యువతకు అన్నీరంగాల్లో రాణించేలా సలహాలిస్తున్నారు.

తాజాగా టాటా ఇన్ స్టాగ్రామ్ యూజర్లు వన్ మిలియన్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఫోటో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట్లో సందడి చేస్తుంది. ముఖం మీద చిరునవ్వుతో నేలపై కూర్చుని ఉన్న ఫోటోను షేర్ చేస్తూ  ఇన్ స్టా గ్రామ్ లో తన  ప్రయాణానికి మద్దతు పలికిన అనుచరులకు కృతజ్ఞతలు తెలిపారు.

Latest Updates