ఇతను రతన్​టాటా.. అంటే నమ్ముతారా?

అచ్చం హాలీవుడ్​ హీరోలా ఉన్న ఆయన, రతన్​ టాటా అంటే నమ్ముతారా? నమ్మితీరాల్సిందే.. ఎందుకంటే ఆయనే స్వయంగా ఇన్​స్టాగ్రామ్​లో ఆ ఫొటో పెట్టారు కాబట్టి. వయసులో ఉన్నప్పుడు లాస్​ఏంజిలిస్​లో తీసిన ఫొటోనట ఇది. ఇండియాకు వచ్చే కొద్ది రోజుల ముందే క్లిక్​మనిపించారట. ‘త్రోబ్యాక్​ థర్స్​డే’ అంటూ ఆయన ఈ ఫొటోను పోస్ట్  చేశారు. ఆ ఫొటోకు నెటిజన్లు తెగ లైకులు కొట్టేస్తున్నారు. అచ్చం హాలీవుడ్​ హీరోలా ఉన్నారంటూ పొగిడేస్తున్నారు. ఆ కళ్లలో ఓ మెరుపుందంటూ మెచ్చుకుంటున్నారు.

Latest Updates