టాటాకూ ఉందో లవ్​ స్టోరీ… పెండ్లిని ఇండో-చైనా వార్​ ఆపేసింది

అమ్మాయిని ఇండియాకు పంపించని ఆమె తల్లిదండ్రులు

హ్యూమన్స్​ ఆఫ్​ బాంబే

ఎఫ్​బీ పేజ్​లో తన లైఫ్​ను చెప్పిన రతన్​ టాటా

ప్రేమ, ఇష్క్​, కాదల్​, లవ్​.. ఏ భాష అయితేంది.. ప్రతి మనిషి లైఫ్​లో ఎక్కడో ఓ సందర్భంలో అది టచ్​ అవుతుంది. డబ్బున్నోళ్లు, పేదోళ్లు అన్న తేడా అందులో లేదు. రతన్​ టాటా కూడా అందుకు మినహాయింపేమీ కాదు. అవును మరి, ఆయనకూ ఉందో లవ్​ స్టోరీ. కాకపోతే, పెళ్లి జస్ట్​ మిస్​ అయిపోయింది. లవ్​ ఒక్కటే కాదు, ఆయన జీవితంలో కష్టనష్టాలు, ఇంటి గొడవలూ ఉన్నాయి. ‘బొమ్మరిల్లు ఫాదర్​’ లాంటి ఫాదర్​తో నానా తంటాలూ పడ్డారు. ఆ విషయాలన్నింటినీ ఇటీవల ‘హ్యూమన్స్​ ఆఫ్​ బాంబే’ అనే ఫేస్​బుక్​ పేజీలో ఆయన చెప్పుకొచ్చారు.

పెళ్లిని చైనా వార్​ ఆపేసింది

టాటా యంగ్​ ఏజ్​లో ఉన్నప్పుడు ఒకమ్మాయిని లవ్​ చేశారట. పెళ్లి వరకు మ్యాటర్​ వెళ్లిందట. కానీ, చైనా వార్​.. వాళ్ల పెళ్లికి విలన్​లా మారిందట. ఆర్కిటెక్చర్​ పూర్తి కాగానే లాస్​ఏంజిలిస్​లోని ఓ కంపెనీలో ఆయనకు జాబ్​ వచ్చిందట. అక్కడే ఓ అమ్మాయిని లవ్​ చేశారట. ‘‘ఓ అమ్మాయిని నేను లవ్​ చేశా. పెళ్లి వరకు వెళ్లింది మ్యాటర్​. కానీ, మా నానమ్మకు ఒంట్లో బాగాలేకపోవడం, ఏడేళ్లు ఆమెకు దూరంగా ఉండడంతో, కొన్నేళ్లయినా ఆమె దగ్గర ఉందామని అమెరికా నుంచి ఇండియాకు వచ్చేశా. తర్వాత నేను ప్రేమించిన అమ్మాయి కూడా ఇండియాకు వస్తుందనుకున్నా. కానీ, 1962లో ఇండో–చైనా వార్​ వల్ల ఆమె తల్లిదండ్రులు ఆమెను ఇండియాకు పంపించలేదు. ససేమిరా అన్నారు. అక్కడితో నా ప్రేమకు ఫుల్​స్టాప్​ పడింది’’ అని ఆయన చెప్పుకొచ్చారు.

బొమ్మరిల్లు ఫాదర్​..  ధైర్యం నూరిపోసిన నానమ్మ

బొమ్మరిల్లు సినిమా చూసే ఉంటారు కదా. ఆ సినిమాలో హీరో తండ్రి అతడి ఇష్టాయిష్టాలతో పని లేకుండా తన ఇష్టాలనే బలవంతంగా రుద్దేస్తుంటాడు. రతన్​ టాటా విషయంలోనూ అదే జరిగిందట. ఆయనకు ఒకటి చేయాలనుకుంటే, తన తండ్రి ఇంకోటి చెప్పేవారట. ‘‘ఎవరు కరెక్ట్​, ఎవరు తప్పు అని ఇప్పుడు చెప్పుకోవడం కాదు గానీ, నా ప్రతి ఇష్టాన్నీ మా నాన్న వ్యతిరేకించేవారు. నాకు వయొలిన్​ నేర్చుకోవాలనుంటే, ఆయన పియానో అన్నారు. నేను అమెరికాలో చదువుతానంటే, బ్రిటన్​ వెళ్లమన్నారు. నేను ఆర్కిటెక్ట్​ కావాలనుకుంటే, లేదు నువ్వు ఇంజనీర్​ కావాలని నాన్న పట్టుబట్టారు. కానీ, అవేవీ నాకు ఇష్టం లేదు. మా నానమ్మ లేకపోయుంటే, నేను అమెరికాలోని కార్నెల్​ యూనివర్సిటీలో చదివి ఉండేవాడినే కాదు. మెకానికల్​ ఇంజనీరింగ్​లో అడ్మిషన్​ తీసుకున్నా, ఆమె వల్లే ఆర్కిటెక్చర్​లోకి మారగలిగాను. అయితే, అది మా నాన్నకు నచ్చలేదు. నన్ను కోప్పడ్డారు. కానీ, కాలేజీలో మాత్రం నాది ‘స్వతంత్ర’ లైఫ్​. ప్రతి విషయంలో ఆమె మాకు ధైర్యం నూరిపోసింది. ఎప్పుడు ఎలా ఉండాలో నేర్పింది. ఎంత పెద్ద విషయమైనా నిమ్మలంగా ఎట్ల చెప్పాలో నేర్పించింది’’ అని చెప్పారు.

అమ్మానాన్న విడాకులు తీసుకోవడం బాధపెట్టింది

రతన్​ టాటాను అత్యంత బాధపెట్టిన విషయం వాళ్ల అమ్మానాన్నల విడాకులేనట. ‘‘నా చిన్నతనమంతా చాలా హ్యాపీగా సాగిపోయింది. కానీ, నేను, నా అన్న పెరిగే కొద్దీ ఆ హ్యాపీనెస్​ అంతా పోయింది. అమ్మానాన్న విడిపోవడంతో ఎంతో బాధించింది. జీవితమంతా ఏదో కోల్పోయిన ఫీలింగ్​. ఎందుకంటే, అప్పట్లో విడాకులంటే ఇప్పుడున్నంత కామన్​ కాదు. మా అమ్మ రెండో పెళ్లి చేసుకోవడంతో స్కూల్లోని పిల్లలంతా గేలి చేసేవారు. కానీ, ఎక్కడా మా నిబ్బరం మేం కోల్పోలేదు. అందుకు కారణం మా నానమ్మే. ఏ సందర్భంలోనైనా ఎలా ఉండాలో ఆమే మాకు నేర్పింది’’ అని ఆయన చెప్పారు.

Latest Updates