ఓలా ఎలక్ట్రిక్ లో రతన్‌ టాటాకు వాటా

క్యాబ్ అగ్రిగ్రేటర్‌ ఓలా క్యాబ్స్‌‌‌‌‌‌‌‌ ఎలక్ట్రిక్‌‌‌‌‌‌‌‌ వెహికిల్‌ వ్యాపారం.. ఓలా ఎలక్ట్రికల్‌ మొబిలిటీ(ఓఈఎం)లో చైర్మన్‌ ఎమిరిటస్‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ టాటా సన్స్‌‌‌‌‌‌‌‌ రతన్‌ టాటా పెట్టుబడులు పెట్టారు . ఇది సిరీస్‌ ‘ఏ’ఫండింగ్‌‌‌‌‌‌‌‌ అని, టాటా తన వ్యక్తిగత హోదాలోనే ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌ చేశారని ఓలా తెలిపింది. అయితే పెట్టుబడుల విలువను మాత్రం వెల్లడించలేదు. తమ ఎలక్ట్రిక్‌‌‌‌‌‌‌‌ మొబిలిటీ వ్యాపారం విజయవంతం కావడానికి రతన్‌ టాటా సుదీర్ఘ అనుభవం, నాయకత్వ లక్షణాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపింది. ఓలా పేరెంట్‌‌‌‌‌‌‌‌ కంపెనీ ఏఎన్‌ఐ టెక్నాలజీస్‌ లోనూ ఆయన గతంలో ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఈ ఏడాది మార్చిలో టైగర్‌ గ్లోబల్‌, మ్యాట్రిక్స్‌‌‌‌‌‌‌‌ ఇండియా నుంచి రూ.400 కోట్లనిధులు అందినట్టు ఓఈఎం ప్రకటించింది.

ఎలక్ట్రిక్‌‌‌‌‌‌‌‌ వాహనాల వినియోగం బాగా పెరుగుతోందని, ఈరంగంలో ఓలా ఎలక్ట్రిక్‌‌‌‌‌‌‌‌ కీలకపాత్ర పోషిస్తుందని భా-విస్తున్నట్టు రతన్‌ టాటా పేర్కొన్నారు. ఓలా ఎలక్ట్రిక్‌‌‌‌‌‌‌‌ ఇది వరకే పలు బ్యాటరీ కార్లను, బైకులను, ఆటోలనునడుపుతూ చార్జింగ్‌‌‌‌‌‌‌‌ స్టేషన్లను, బ్యాటరీ మార్పిడి కేంద్రాలను కూడా నిర్వహిస్తోంది. రతన్‌ టాటా తనకు వ్యక్తిగతంగా మార్గదర్శి అని, ఆయన స్ఫూర్తితోనే ఓలా రూపుదిద్దుకుందని సంస్థ సీఈఓ భవీశ్‌ అగర్వాల్‌ చెప్పారు. ఆయన తమ సంస్థలో పెట్టుబడులు పెట్టినందుకు ఎంతో సంతోషంగా ఉందని, 2021నాటికి పది లక్షల ఎలక్ట్రిక్‌‌‌‌‌‌‌‌ వాహనాలను నడపాలన్నలక్ష్యాన్ని సాధిస్తామని అన్నారు .

Latest Updates