తిరుమలలో రథసప్తమి వేడుకలు

తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయంలో ఇవాళ (మంగళవారం) రథసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. రథసప్తమి సందర్భంగా ఆలయంలో అన్ని రకాల ఆర్జిత సేవలను రద్దు చేశారు. వీఐపీ బ్రేక్‌ దర్శనాలను పరిమితం చేశారు. ప్రత్యేక దర్శనాలను రద్దు చేశారు. రథసప్తమి సందర్భంగా స్వామివారు సప్త వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉదయం సూర్యప్రభ వాహనం, చిన్న శేషవాహనం, గరుడ వాహన సేవలు నిర్వహించారు. మధ్యాహ్నం హనుమంత వాహనం, చక్రస్నానం, సాయంత్రం కల్పవృక్ష, సర్వభూపాల వాహన సేవలు నిర్వహించనున్నారు. రాత్రికి చంద్రప్రభ వాహన సేవ నిర్వహించనున్నారు. రథసప్తమి వేడుకల సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రథసప్తమి సందర్భంగా అంగప్రదక్షిణ టోకెన్లు రద్దు చేశారు.

Latest Updates