విశాఖ బీచ్‌ రోడ్‌లో రేవ్ పార్టీ కలకలం

Rave party held in Visakha Beach road

విశాఖపట్నంలోని బీచ్ రోడ్డులో జరిగిన ఓ రేవ్ పార్టీ కలకలం రేపింది. బీచ్ రోడ్ కు సమీపంలో ఓ హోటల్ పరిసరాల్లో ఈ పార్టీని నిర్వహించినట్టు తెలిసింది. ఎవ్వరికి తెలియకూడదని గుట్టుగా నిర్వహించిన ఈ పార్టీలో… మద్యం, గంజాయి మత్తులో అమ్మాయిలు, అబ్బాయిలు ఊగిపోయారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారే వరకూ.. మ్యూజిక్ హోరుతో తాగి ఊగారు. యువత, విద్యార్థులే లక్ష్యంగా చేసుకుని నిర్వాహకులు ఈ రేవ్ పార్టీ నిర్వహించినట్టు సమాచారం. అర్థరాత్రి వేళ ఆ డీజే హోరుతో విసిగిపోయిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి వచ్చిన పోలీసులు… నిర్వాహకుల లాబీయింగ్‌తో వెనుదిరిగారు. ఇందులో టీడీపీ నేత కుమారుడి పాత్ర ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Latest Updates