బర్త్ డే పార్టీలో చిందులు.. 20 మంది అరెస్ట్

హైదరాబాద్ శివారుల్లో రేవ్ పార్టీలు జనాలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. బలిచిన బడా బాబులు పిల్లలు హాఫ్ డ్రెస్సులతో వస్తారు. మందేసి చిందేస్తూ నానా రచ్చ చేస్తారు. రంగారెడ్డి జిల్లా శివారులోని పహడి షరీఫ్ పోలీస్టేషన్ కు అనుకుని ఉన్న ఎంఆర్ ఖురెషి అనే ఫాంహౌస్ లో శుక్రవారం అర్దరాత్రి బర్త్ డే పార్టీ పేరుతో రేవ్ పార్టీ నిర్వహించారు. ఫామ్ హౌస్ యజమాని సివతుర్ యజమాని కుమారుడు సల్మాన్(22), స్నేహితుడు నదీమ్ హైమద్ ఖాన్(23) పుట్టిన రోజు ఉండడంతో, స్నేహితులు అందరు కలిసి పార్టీ చేసుకునేందుకు మద్యం, హుక్క, గంజాయి, తీసుకుని ఫాంహౌస్ వచ్చారు.

మొత్తం 18 మంది అబ్బాయిలు, వారితో పాటు ఇద్దరు అమ్మయిలు కలిసి వచ్చారు. అయితే నదీమ్ బర్త్ డే సందర్భంగా కేక్ కటింగ్ తర్వాత అందరూ మద్యం, హుక్కా, గంజాయి, సేవించి డీజె సౌండ్ తో అర్ధరాత్రి అర్దనగ్నంగా చిందులు వేశారు. అరుపులు కాస్తా చుట్టు పక్కల గ్రామాల్లోని ప్రజలకు వినిపించడంతో..విసిగి పోయినవారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పహడి షరీఫ్ పోలీసులు సంఘట స్థలానికి చేరుకుని ..అక్కడ వారు చేస్తుంన్న తతంగం అంతా సీక్రెట్ గా గమనించారు.

దీంతో పోలీసులు ఇద్దరు అమ్మయిలతో సహ మొత్తం 20 మందిని అదుపులోకి తీసుకుని వారి దగ్గర నుంచి ఐదు కార్లు, రెండు బైకులు, మద్యం, హుక్కా సంబంధించిన సామాను, 200 గ్రాముల గంజాయి,18 సెల్ ఫోన్స్ స్వాదీనం చేసుకున్నారు. వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.

Latest Updates