గోరఖ్ పూర్ బరిలో రేసుగుర్రం విలన్

Ravi Kishan, Bhojpuri Star, Is BJP's Hero For Gorakhpur Prestige Clash

భోజ్ పురి నటుడు రవికిషన్ ని బరిలో నిలిపిన బీజేపీ

లక్నో: గోరఖ్ పూర్ లోక్ సభ సెగ్మెంట్ నుంచి భోజ్ పురి నటుడు రవికిషన్ ను బీజేపీ పోటీలో నిలిపింది. సోమవారం ఈమేరకు 7 సీట్లకు అభ్యర్థులను ప్రకటించిం ది. దీంతో మొత్తంగా బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 420కి చేరింది. గోరఖ్ పూర్ సిట్టింగ్ ఎంపీ ప్రవీణ్ నిషాద్ కు, సంత్ కబీర్ నగర్ టికెట్ ఇచ్చింది.బీజేపీ ఎమ్మెల్యేను బూటుతో కొట్టిన ఇక్కడి సిట్టింగ్ ఎంపీ శరద్ త్రిపాఠిని పక్కన బెట్టింది.2014 ఎన్నికల్లో గోరఖ్ పూర్ సీటు నుంచి యోగి ఆదిత్యనాథ్ గెలుపొందారు. ఆయన యూపీ సీఎంగా వెళ్లడంతో ఆ సీటు ఖాళీ అయిం ది. ఎస్పీ అభ్యర్థిగా ఉప ఎన్నికల్లో పోటీ చేసి ప్రవీణ్ నిషాద్ గెలిచారు. తర్వాత బీజేపీలోకి చేరారు. కాగా భోజ్ పురిలో ప్రముఖ నటుడైన రవికిషన్.. తెలుగు సినిమాల్లోనూ పాపులర్. రేసుగుర్రం, సుప్రీం, కిక్2 సినిమాల్లో నటించారు.

Latest Updates