బేదాభిప్రాయాలను గొడవలంటే ఎలా: రవిశాస్త్రి

దుబాయ్‌‌ : టీమిండియా కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీ, రోహిత్‌‌ శర్మ మధ్య వివాదాలున్నాయంటూ వస్తున్న వార్తలను కోచ్‌‌ రవిశాస్త్రి కొట్టి పారేశాడు.15 మంది ఉన్న జట్టులో బేదాభిప్రాయాలు సహజమన్న  రవిశాస్త్రి  వాటిని గొడవలుగా ప్రచారం చేయడం తగదన్నాడు. ఎవరైనా కొత్త ఆలోచనతో ముందుకొస్తే వస్తే వాళ్లని ప్రొత్సహించాలని, ప్రతిఒక్కరికీ అవకాశమిస్తేనే మంచి ఫలితం వస్తుందన్నాడు. ఒక్కోసారి జట్టులో అందరికంటే జూనియర్‌‌ ఓ కొత్త ప్లాన్‌‌తో ముందుకొచ్చినా దానిని స్వీకరిస్తామని, అంతేకానీ ప్రతీది వివాదం కాదన్నాడు.

జట్టు సభ్యుల మధ్య నిజంగా గొడవలు ఉంటే రోహిత్‌‌ వరల్డ్‌‌కప్‌‌లో ఐదు సెంచరీలు ఎలా చేయగలిగాడని శాస్త్రి ప్రశ్నించాడు. అంతేకాక కోహ్లీతో కలిసి కీలక ఇన్నింగ్స్‌‌ కూడా ఆడాడని గుర్తు చేశాడు. 80ల్లో వెస్టిండీస్‌‌, ఆ తర్వాత ఆస్ట్రేలియా చేసినట్టుగా క్రికెట్‌‌పై తమ ముద్ర వేసేందుకు సిద్ధంగా ఉన్న టీమిండియా చుట్టు వివాదాలు సృష్టించడం సమంజసం కాదన్నాడు. అన్ని ఫార్మాట్‌‌ల్లోను టీమిండియా ఐదేళ్లుగా అద్భుతంగా ఆడుతుందని హెడ్‌‌ కోచ్‌‌ రవిశాస్త్రి తెలిపాడు.

Latest Updates