
న్యూఢిల్లీ: టీమిండియా బోర్డర్–గావస్కర్ ట్రోఫీ నిలబెట్టుకోవడంలో కీరోల్ పోషించిన హైదరాబాదీ మహ్మద్ సిరాజ్‌ను హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల్లో ముంచెత్తాడు. ఆసీస్ టెస్ట్ సిరీస్‌లో ఇండియాకు సిరాజ్ దొరికాడని పేర్కొన్నాడు. తండ్రిని కోల్పోయినా, రేసిజమ్కు గురైనా కుంగిపోకుండా జట్టును గెలిపించాడని కోచ్ రవిశాస్త్రి శుక్రవారం ట్వీట్ చేశాడు. ‘ఆసీస్ సిరీస్ ద్వారా మనకు సిరాజ్ లాంటి ప్లేయర్ దొరికాడు. టఫ్ టైమ్‌లో బౌలింగ్ అటాక్‌ను అతను నడిపించిన తీరే ఇందుకు నిదర్శనం. పర్సనల్ లాస్, రేసిజమ్ కామెంట్స్‌ను భరిస్తూ పోరాడాడు. టీమ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు’ అని రవిశాస్త్రి ట్వీట్ చేశాడు. ఆస్ట్రేలియా సిరీస్‌కు ముందు సిరాజ్ తండ్రి కన్నుమూశాడు. కానీ, ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్‌తో సిరాజ్ ఆసీస్‌లోనే ఉండిపోయాడు. సీనియర్ బౌలర్లు గాయపడటంతో ఫైనల్ ఎలెవన్‌లోకి వచ్చిన సిరాజ్ గబ్బా టెస్ట్‌లో ఓ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు సాధించాడు. ఓవరాల్‌గా 13 వికెట్లు తీసి సిరీస్‌లో ఇండియా టాప్ బౌలర్‌గా నిలిచాడు.