టీమిండియా హెడ్ కోచ్ గా మళ్లీ రవిశాస్త్రినే..

ముంబై :టీమిండియా హెడ్ కోచ్ గా రవిశాస్త్రినే మళ్లీ సెలక్ట్ అయ్యాడు. కపిల్ దేవ్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ముంబైలోని BCCI ఆఫీసులో షార్ట్ లిస్ట్ చేసిన ఆరుగురికి ఇంటర్వ్యూ నిర్వహించింది. వీరందరిలో బెస్ట్ ని కన్ఫమ్ చేసిన BCCI..రవిశాస్త్రిని హెడ్ కోచ్ గా మరోసారి సెలక్ట్ చేసినట్లు తెలిపింది. కమిటీ సెలక్షన్ తర్వాత ఈ విషయాన్ని మీడియా సమావేశం ఏర్పాటు చేసి అఫీషియల్ గా అనౌన్స్ చేసింది BCCI.

ఈ సంరద్భంగా కపిల్‌ దేవ్‌ మాట్లాడుతూ… భారత ఆటగాళ్లపైన, ఇతర అన్ని అంశాలపై రవిశాస్త్రికి పూర్తి అవగాహన ఉందన్నారు. 2021టీ20 వరల్డ్ కప్ వరకు రవిశాస్త్రి టీమిండియాకు కోచ్ గా వ్యవహరించనున్నట్లు తెలిపాడు కపిల్ దేవ్.

Latest Updates