పాండ్యాపై రవిశాస్త్రి ప్రశంసలు

ఒక్క మ్యాచ్ తో వివాదాలన్ని తుడిచేశాడు

ముంబై : టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాపై ప్రశంసలు కురించాడు కోచ్ రవిశాస్త్రి. న్యూజిలాండ్ తో జరిగిన ఐదో వన్డేలో భారత్ గెలవడానికి హార్దిక పాండ్యనే ప్రధాన కారణమన్నాడు. ఈ మ్యాచ్ లో 18 రన్స్ కే 4 కీలక వికెట్లు కోల్పోయిన భారత్ ..కనీసం 100 రన్స్ అయినా చేస్తుందా అనుకున్నారు కానీ.. చివర్లో వచ్చిన పాండ్యా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. హాట్రిక్ సిక్స్ లతో స్టేడియం హోరెత్తించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో హార్దిక్ పాండ్యాపై విషెస్ వెల్లువెత్తుతున్నాయి.

లేటెస్ట్ గా రవిశాస్త్రి మాట్లాడుతూ..‘కాఫీ విత్ కరణ్‌’ వివాదం తర్వాత పాండ్య కెరీర్‌ గురించి చాలా మంది విచారించి ఉంటారు. అందులో నేను కూడా ఉన్నాను. కానీ పాండ్య వీటన్నింటినీ తట్టుకుని నిలబడ్డాడు.

ఈ టాక్‌ షో తర్వాత విమర్శకులు అతడి మానసిక స్థితిని దెబ్బ తీసే ప్రయత్నం చేశారు. కానీ అతడు ఇంత త్వరగా బయటపడతాడని అనుకోలేదు. పాండ్య నిజమైన హీరో. అతడు  టీమ్ లోకి తిరిగి వచ్చినందుకు ఎంతో సంతోషిస్తున్నా. ఇప్పుడు పాండ్యకు మరో పాండ్య(కృనాల్‌ పాండ్య) తోడయ్యాడు. ఒక్క మ్యాచ్‌లో అతడు ప్రభావం చూపలేనంత మాత్రాన తక్కువగా అంచనా వేయలేను. అతడిలో ఎంత కసి ఉందో న్యూజిలాండ్‌ తో జరిగిన ఐదో వన్డేలోనే అర్థమయింది. ఒక కోచ్‌ గా నేను పాండ్యను చూసి గర్వపడుతున్నాను. తప్పులు చేయకుండా ఎవరుంటారు? ఏదో ఒక సందర్భంలో అందరూ తప్పులు చేసేవారే. కాకపోతే ఇప్పుడు పాండ్య వంతు వచ్చింది. అదృష్టవశాత్తూ పాండ్య దాని నుంచి త్వరగా బయట పడ్డాడు’ అని చెప్పుకొచ్చాడు రవిశాస్త్రి.

 

Latest Updates