‘క్రాక్’గా మాస్ మహారాజ్ రవితేజ

గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజ్ హీరోగా నటిస్తున్న 66వ చిత్రం పేరు కన్ఫర్మ్ అయింది. ఈ చిత్రానికి ‘క్రాక్’గా టైటిల్ అనౌన్స్ చేశారు దర్శకుడు గోపిచంద్ మలినేని. ఈ చిత్ర ప్రారంభానికి ఈ రోజు ముహుర్తంగా నిర్ణయించారు. ఆ విషయాన్ని దర్శకుడు గోపిచంద్ మలినేని తన ట్విట్టర్ ద్వారా పంచుకుంటూ టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రాన్ని యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. ప్రస్తుతం రవితేజ వీఐ. ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డిస్కో రాజా సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా విడుదల కాకముందే రవితేజ మరో సినిమాను ఒప్పుకోవడంతో ఆయనెంత స్పీడు మీదున్నారో అర్ధమవుతుంది.

సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్‌పై రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ‘క్రాక్’ చిత్రంలో శృతి హాసన్, వరుశరత్, ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Latest Updates