నెక్స్ట్ మ్యాచ్‌ కు రెడీ అవుతున్న అశ్విన్

దుబాయ్‌: గాయం నుంచి కోలుకుంటున్న సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ .. తమ సెకండ్‌ మ్యాచ్‌ కు అందుబాటులో ఉంటాడని ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌ చెప్పాడు. అయితే అశ్వి న్‌ ఆడే విషయంలో ఫిజియోదే తుది నిర్ణయమని చెప్పాడు. ఈ సీజన్‌ లో ఢిల్లీకి ఆడుతున్న అశ్విన్‌ ఆదివారం పంజాబ్‌ తో జరిగిన మ్యాచ్‌ లో ఆరు బంతుల తేడాతో రెండు వికెట్లు తీశాడు. ఫీల్డింగ్‌ చేసే క్రమంలో అశ్విన్‌ భుజం నేలకు బలంగా తాకడంతో వెంటనే మైదానాన్ని వీడాడు. అశ్వి న్‌ షోల్డర్‌ డిస్‌‌‌‌లొకేట్‌ అయ్యిందని భావించారు. కానీ ఆ గాయం చిన్నదేనని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. ‘నేను అశ్విన్‌ తో మాట్లాడా. తర్వాతి మ్యాచ్‌ కు రెడీగా ఉంటానని చెప్పాడు. అతను ధైర్యవంతుడు. కచ్చితంగా వచ్చే మ్యాచ్‌ ఆడతాడు. గాయం విషయంలో ఫిజియోనే తుది నిర్ణయం తీసుకుంటాడు’ అని అయ్యర్‌ వ్యాఖ్యానించాడు.

 

Latest Updates