అర్జున అవార్డుకు నామినేటైన జడేజా

భారత క్రికెటర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అర్జున అవార్డుకు నామిటేడ్ అయ్యాడు. రిటైర్డ్ జస్టిస్ ముకుందకమ్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ జడేజాతో పాటు మరో 18 మంది క్రీడాకారులను అర్జున అవార్డ్ కు నామినేట్ చేసింది. బీసీసీఐ అర్జున అవార్డుకు మొహమ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, మహిళా జట్టు లెగ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్‌లను రికమెండ్ చేసింది.  జడేజా ఇటీవల జరిగిన వరల్డ్ కప్ సెమీఫైనల్ లో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో 59 బాల్స్ లో 79 రన్స్ తో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. జడేజా 41 టెస్టులు,156 వన్డేలు, 42 టీ 20 లు ఆడాడు. రెజ్లర్ భజ్ రంగ్ పునియా, పారా అథ్లెడ్ దీపా మాలిక్ లు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుకు ఎంపికయ్యారు.

Latest Updates