డిసెంబర్‌‌‌‌లో డబుల్ ధమాకా

ఇద్దరు ఫేమస్‌‌ హీరోలు… భిన్నమైన ఇమేజ్ ఉన్నవారు.. విభిన్నమైన సినిమాలు చేస్తున్నారు.. కానీ ఇద్దరూ ఒకేసారి రావడానికి రెడీ అవుతున్నారు. ఒకే తేదీన వస్తారో లేదో తెలీదు కానీ.. ఒకే నెలలో మాత్రం రానున్నారు. వాళ్లెవరో కాదు.. రవితేజ, నితిన్. వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న ‘డిస్కో రాజా’ సినిమాని డిసెంబర్‌‌‌‌ 20న విడుదల చేయనున్నట్లు దర్శక నిర్మాతలు ప్రకటించారు. పాయల్‌‌ రాజ్‌‌పుత్, నభా నటేష్‌‌ హీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్న ఈ మూవీ సైన్స్ ఫిక్షన్‌‌ సబ్జెక్ట్‌‌తో తెరకెక్కుతోంది. భారీ హంగులతో తీస్తున్నట్లు నిర్మాత రామ్ తాళ్లూరి చెప్పారు.

మరోపక్క నితిన్‌‌, వెంకీ కుడుముల కాంబినేషన్‌‌లో రూపొందుతున్న ‘భీష్మ’ను కూడా క్రిస్మస్‌‌ కానుకగా విడుదల చేయనున్నట్లు నితిన్  అనౌన్స్ చేశాడు.రష్మిక మందాన్న హీరోయిన్‌‌గా నటిస్తున్న ఈ మూవీ యూత్‌‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌ అని తెలుస్తోంది. మరి ఈ మూవీని ఏ తేదీన బైటికి తీసుకొస్తారన్నది తెలియాల్సి ఉంది. వీళ్లిద్దరి కంటే ముందే సాయి తేజ్‌‌ ఖర్చీఫ్‌‌ వేసేశాడని, మారుతి డైరెక్షన్‌‌లో అతడు నటిస్తున్న ‘ప్రతిరోజూ పండగే’ కూడా క్రిస్మస్‌‌కే రానుందని అంటున్నారు. మరోపక్క శర్వానంద్, సమంతల ‘96’ రీమేక్‌‌ని కూడా క్రిస్మస్‌‌కి తీసుకొచ్చేందుకు దిల్‌‌ రాజు ప్లాన్ చేస్తున్నారన్నది ఇండస్ట్రీ టాక్. ఈ లెక్కన డిసెంబర్​లో పెద్ద ధమాకాయే ఉంటుంది. ఒకేసారి ఇన్ని సినిమాలు రావడం ప్రేక్షకులకు పండగే కానీ సినిమాల మధ్య కాంపిటీషన్ అయితే ఉంటుంది. అయినా కూడా ముందు ప్రకటించిన సమయానికే ముగ్గురూ వస్తారా లేక మొన్న గ్యాంగ్‌‌ లీడర్, వాల్మీకి సినిమాలకు సర్దుబాటు చేసినట్లు వీళ్లు కూడా ఏమైనా చేసుకుంటారా అనేది చూడాలి.

Latest Updates