RBI ఇవ్వగానే అందరి అకౌంట్లలో రూ.15లక్షలేస్తాం.. కేంద్రమంత్రి కామెంట్

బ్లాక్ మనీ వెనక్కి తీసుకొస్తామని.. ఆ డబ్బులు పేదల బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తామని గతంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ హామీ ఇచ్చారు. ప్రతి అకౌంట్ లో రూ.15లక్షలు డిపాజిట్ చేస్తామని చెప్పారు. నాలుగున్నరేళ్లయినా మోడీ ఈ హామీని నిలబెట్టుకోకపోవడంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూనే ఉన్నాయి. ఈ సంగతి అలా ఉంచితే… కేంద్రమంత్రి రామ్ దాస్ అథవాలే చేసిన ప్రకటన చాలామందికి నవ్వు తెప్పిస్తోంది. ప్రతి ఒక్క బ్యాంక్ అకౌంట్ లో చెప్పినట్టుగానే కేంద్రం రూ.15లక్షలు వేస్తుందనీ… ఐతే… దీనికి కొంత టైమ్ పడుతుందని చెప్పారు అథవాలే. “నిధుల కోసం ఆర్బీఐని అడిగాం. ఐతే.. వాళ్లివ్వడం లేదు. అందుకే.. అమౌంట్ వసూలు కావడం లేదు. దీనిని కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అడ్డుపడుతున్నాయి. ఒక్కసారిగా కాదు కానీ.. అందరి అకౌంట్లలో నెమ్మదిగా డబ్బులు పడతాయ్” అని చెప్పారు రామ్ దాస్ అథవాలే.

కేంద్రమంత్రి చేసిన ఈ కామెంట్ పై సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. అథవాలేను అర్జెంట్ గా కేంద్ర ఆర్థికమంత్రిగా గానీ… ఆర్బీఐ గవర్నర్ గా గానీ నియమించాలని అన్నారు. ఆర్బీఐ మిగులు నిధుల నుంచి కాదు.. వెనక్కి తెప్పించిన బ్లాక్ మనీ నుంచి అకౌంట్లలోకి రూ.15లక్షలు డిపాజిట్ కావాలని మరికొందరు అన్నారు.

Posted in Uncategorized

Latest Updates