మూడు నెలలు ఈఎమ్ఐ కట్టక్కర్లేదు: ఆర్బీఐ

కరోనా ప్రభావంతో ఆర్బీఐ కీలక నిర్ణయం

కరోనా దేశంలో విస్తరిస్తుండటంతో దేశం అంతా ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. దాంతో ప్రజలు తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. సామాన్యులను దృష్టిలో ఉంచుకొని ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రుణాలపై మూడు నెలలపాటు మారటోరియం విధించింది. ఈఎమ్ఐలు, హౌసింగ్ లోన్లు, ఇతరత్రా లోన్లంటిపై వచ్చే మూడు నెలలపాటు మారటోరియం విధిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. సహకార బ్యాంకులలో తీసుకున్న రుణాలకు కూడా ఈ మారటోరియం వర్తిస్తుందని ఆయన తెలిపారు. మారటోరియం అంటే ఇప్పుడు కట్టాల్సిన వాయిదాలు తర్వాత కట్టుకునే వెసులుబాటు కల్పించడమే దీని లక్ష్యం. అంటే వచ్చే మూడు నెలలు వాయిదాలు కట్టకపోయినా సిబిల్ స్కోర్‌పై ఎటువంటి ప్రభావం పడదు. డబ్బులుంటే వాయిదా చెల్లించొచ్చు లేకపోతే మూడు నెలల తర్వాత అయినా కట్టుకోవచ్చు. బ్యాంకులు ఆర్బీఐకు చెల్లించే రెపో రేటును 4.4 శాతానికి తగ్గించినట్లు ఆయన తెలిపారు. అంటే రెపో రేటును 75 పాయింట్లు తగ్గించారు. అదే విధంగా ఆర్బీఐ; బ్యాంకులకు చెల్లించే రివర్స్ రెపో రేటును కూడా 4 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. అంటే రివర్స్ రెపో రేటును 90 బేసిస్ పాయింట్లు తగ్గించారు. ఈ షరతులన్నీ మార్చి 1 నుంచి అమలులోకి వస్తాయని ఆయన తెలిపారు.

కాగా.. ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల బ్యాంకులు కూడా వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉంది.

For More News..

ఒక్కో వ్యక్తికి రూ.91 వేల ఆర్థికసాయం ప్రకటించిన అమెరికా

కరోనాకు ఆన్‌లైన్‌లో ట్రీట్‌మెంట్

అద్దె ఇంటి ఓనర్లకు సర్కారు వార్నింగ్

కరోనాకు విరుగుడు పేషంట్ల రక్తమే

Latest Updates