
కొత్త క్రెడిట్ కార్డులివ్వొద్దని హెచ్ డీఎఫ్ సీ బ్యాంకును ఆదేశించింది ఆర్బీఐ. గత రెండేళ్లుగా హెచ్ డీఎఫ్ సీ ఇంటర్నెట్,మొబైల్ బ్యాంకింగ్ వంటి పేమెంట్ సేవలకు అంతరాయం కల్గుతున్నందును ఈ ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకింగ్ డిజిటల్ పేమెంట్స్ లో లోపాలు ఉన్నందున సవరించే వరకు కొత్త కార్డులు జారీ చేయకూడదని ఆదేశించింది. అంతేగాకుండా హెచ్ డీఎఫ్ సీ క్రెడిట్ కార్డు వినియోగదారులు బిల్లులను సరిగా కట్టడం లేదని గతంలో ఆర్బీఐకి ఫిర్యాదు చేసింది. నవంబర్ 21న బ్యాంక్ ప్రైమరీ డేటా సెంటర్లో విద్యుత్ నిలిచిపోవడంతో డిజిటల్ పేమెంట్స్ ఆగిపోయాయని..అందుకే ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసిందని హెచ్ డీఎఫ్ సీ తెలిపింది. కస్లమర్ల సమస్యలను పరిష్కరించి వారికి జవాబుదారితనంగా ఉండాలని బ్యాంకు బోర్డుకు తెలిపింది.