మారటోరియం గడువు మరో మూడు నెలలు పెంచిన ఆర్బీఐ

వడ్డీ రేట్లలో కీలక మార్పులు చేసిన ఆర్బీఐ

ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ప్రెస్‌మీట్

రెండు నెలల్లో మూడో ప్రెస్‌మీట్

కరోనా వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని గతంలో ఇచ్చిన మారటోరియాన్ని మరో మూడు నెలలు పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటించారు. దేశ ఆర్థిక పరిస్థితిపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టిన ఆర్బీఐ తాజాగా మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. లోన్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దాంతో 0.4 శాతం వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. రెపో రేటును 4.4 నుంచి 4 శాతానికి తగ్గించింది. రివర్స్ రెపో రేటును 3.2 శాతానికి తగ్గించింది. దాంతో వడ్డీ రేట్లు 40 బేసిస్ పాయింట్లు తగ్గనున్నాయి. ఆర్బీఐ బ్యాంకులకు నగదు లభ్యతను పెంచింది. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉందని ఆర్బీఐ ప్రకటించింది. ప్రస్తుతం కరోనా వల్ల ప్రపంచ ఆర్థికవ్యవస్థ మందగమనంలో ఉందని గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. లాక్డౌన్‌ వల్ల ప్రపంచ మార్కెట్లన్నీ ఒడిదుడుకుల్లో పడ్డాయని ఆయన అన్నారు. కరోనా వల్ల దేశ ఆర్థికవ్యవస్థ కుదేలయిందని ఆయన తెలిపారు. ఏప్రిల్‌లో ఆహార ద్రవ్యోల్బణం 8.6 శాతానికి పెరిగినట్లు ఆయన తెలిపారు. విదేశీ మారకం నిల్వలు 487 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉందని.. ఏడాది చివరివరకు కూడా ద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉంటుందని ఆయన తెలిపారు. ఈ ఏడాది జీడీపీ వృద్ధి రేటు తగ్గే అవకాశముందని ఆయన అన్నారు. అంతేకాకుండా.. 2021లోనూ జీడీపీ పెరిగే అవకాశం లేదని ఆయన అన్నారు. మార్చిలో పారిశ్రామిక ఉత్పత్తి 17 శాతం తగ్గిందని ఆయన అన్నారు. మార్చి, ఏప్రిల్‌లో సిమెంట్ పరిశ్రమపై కరోనా ప్రభావం ఎక్కువగా పడిందని ఆయన అన్నారు.

గతంలో ఈఎమ్ఐలపై మూడు నెలల మారటోరియం ఇచ్చిన ఆర్బీఐ.. తాజాగా మరో మూడు నెలలు మారటోరియం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దాంతో చాలామందికి భారీ ఊరట లభిస్తుంది. గతంలో మార్చి నుంచి మే31 వరకు మారటోరియం ఇచ్చారు. ప్రస్తుతం జూన్ 1 నుంచి ఆగష్టు 31 మారటోరియం గడువును పెంచింది.

For More News..

24 గంటల్లో 6వేలకు పైగా కరోనా కొత్త కేసులు

బాలిక శవంతో శృంగారం చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి

స్వామి గౌడ్ మృతిపట్ల కిషన్ రెడ్డి సంతాపం

Latest Updates